జాతీయ సైన్స్ సెమినార్ 2018 పోటీలు నిర్వహించడం జరుగుతుంది.
సెమినార్ అంశం: industrial revolution 4.0 – are we ready? పారిశ్రామిక విప్లవం 4.0 – మనం సిద్ధమా?
8,9 మరియు 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు.
భారత రాజ్యాంగం ఆమోదించిన ఏ భాషలోనైనా సెమినార్ ఇవ్వవచ్చు.
ప్రతి విద్యార్థికి సంబంధించిన విషయం గురించి మాట్లాడడానికి 6 నిమిషాల సమయం కేటాయించబడుతుంది.
తదుపరి రెండు నిమిషాల సమయంలో అంశానికి సంబంధించి న్యాయనిర్ణేతలు అడిగే మూడు ప్రశ్నలలో కనీసం రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.
సెమినార్ ప్రజెంటేషన్ కొరకు 5 పోస్టర్లు ఉపయోగించవలసి ఉంటుంది. లేదా 5 స్లైడ్ లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వొచ్చు.
యానిమేషన్లు, గ్రాఫిక్ లు అనుమతించబడవు.
ప్రెసెంటేషన్లోని శాస్త్రీయ భావనలకు 40 మార్కులు,
ప్రసంగంలోని ఫ్లుయెన్సీకి 25 మార్కులు,
20 ప్రశ్నలతో నిర్వహించే వ్రాతపరీక్షకు 10 మార్కులు,
న్యాయనిర్ణేతల ప్రశ్నలకు ఇచ్చే మౌఖిక సమాధానాలకు 10 మార్కులు,
విసువల్స్ వినియోగంలో నవ్యతకు 15 మార్కులు,
మొత్తం 100 మార్కులకు మూల్యాంకనం చేయబడుతుంది.
జిల్లాస్థాయిలో పాల్గొన్న విద్యార్థుల నుండి ఉత్తమమైన ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపడం జరుగుతుంది.
రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఒక్క విద్యార్థిని జాతీయస్థాయి పోటీలకు 05-10-2018న విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ కల్ మ్యూజియం, బెంగుళూరు కు పంపడం జరుగుతుంది.
కావున ఈ సదవకాశాన్ని జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలు వినియోగించుకోవలసిందిగా కోరడమైనది.